క్రిప్టోకరెన్సీపై బిల్లును సిద్ధం చేసిన కేంద్రం..!

-

క్రిప్టోకరెన్సీపై బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021 పేరుతో బిల్లును సిద్ధం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాలో బిల్లును కేంద్రం చేర్చింది. ఆర్బీఐ ఆధ్వర్యంలో సొంత డిజిటల్ కరెన్సీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
అదే సమయంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీని కొన్ని మినహాయింపులతో బ్యాన్ చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలో నల్లధనం భారీగా దాచిపెట్టే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది. ఏడాదిలో బిట్‌కాయిన్ ధర రెట్టింపు అయ్యింది.

దాంతో ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 60వేల డాలర్లకు చేరింది. భారత్ నుండి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నట్టు కేంద్రం అంచనా వేస్తోంది. వీరంతా కలిసి దాదాపు రూ. 40వేల కోట్లు క్రిప్టోలో పెట్టుబడి పెట్టినట్టు కేంద్రం అంచనా వేస్తోంది. గత వారం క్రిప్టోకరెన్సీ వ్యవహారంపై ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చ‌ర్చించింది. క్రిప్టో ఎక్సేంజులు, బ్లాక్‌చైన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ సహా పలువురు క్రిప్టో కరెన్సీ రంగ నిపుణులను స్టాండింగ్ కమిటీ క‌లిసి చ‌ర్చించింది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా బ్యాన్ చేయడం కంటే నియంత్రించడం మేలన్న అభిప్రాయానికి స్టాండింగ్ కమిటీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సిడ్నీ డైలాగ్ సందర్భంగా క్రిప్టోకరెన్సీపై ప్రధాని మోదీ మాట్లాడారు. క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని ప్రపంచ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version