ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. అధికార పార్టీ ఎకగ్రీవాలు చెయ్యాలని అనుకోవడం, ఆ తర్వాత కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, కొందరు కీలక అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం సహా పలు పరిణామాలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. దీనిపై రాష్ట్ర హైకోర్ట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం తీరుపై కూడా మండిపడింది.
వరుసగా పిటీషన్లు దాఖలు కావడం వాటిని విచారించడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవల ఎన్నికల అధికారులను నేరుగానే హైకోర్ట్ ప్రశ్నించింది. దీనితో అధికారులు అప్రమత్తమై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఇది పక్కన పెడితే ఇన్నాళ్ళు అధికార వైసీపీకి ఎన్నికల సంఘం అనుకూలంగా ఉందనే వ్యాఖ్యలు టీడీపీ చేస్తూ వస్తుంది.
ఎన్నికల సంఘం కూడా పెద్దగా పట్టించుకున్న విధంగా కనపడటం లేదు. అయితే హైకోర్ట్ కి డీజీపీ వెళ్ళడం ఆ తర్వాత కొన్ని పరిణామాలు ఎన్నికల సంఘం అధికారులను కూడా బాగానే ఇబ్బంది పెట్టాయనే చెప్పవచ్చు. దీనితోనే ఎన్నికల సంఘం అధికారులపై చర్యలకు ఉపక్రిమించడంతో పాటుగా కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసింది. రాజకీయంగా ఇది పెద్ద దుమారం రేపింది ఇప్పుడు. అలాగే వైసీపీ ఏకగ్రీవాల మీద కూడా దృష్టి పెట్టింది.
వాటిని పరిశీలించి అవసరమైతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి తాము వెనుకాడేది లేదని స్పష్టంగా చెప్పింది ఎన్నికల సంఘం. దీనితో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు ఇబ్బంది రాకుండా ఎన్నికల సంఘం వ్యవహరించింది అంటున్నారు. మరి మున్ముందు ఏమవుతుంది అనేది చూడాలి.