పల్నాడు జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌.. ఎస్పీగా మలికా గార్గ్

-

ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్‌ రాజును నియమించింది. ఎన్నికల పరిశీలకుల విధుల్లో లేని అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని, ఆ విధుల్లో ఉన్నవారు ఆదివారం బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందుమాధవ్‌ గరికపాటి, అమిత్‌ బర్దర్‌లను సస్పెండ్‌ చేసి, పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో ఈ కొత్త అధికారులను నియమించింది. బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీకేష్‌ బాలాజీరావు లఠ్కర్‌ ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు పల్నాడు ఎస్పీగా నియమితురాలైన మలికా గార్గ్ 2015 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version