కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ కి ఎన్నికల సంఘం నోటీసులు

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని ఎన్నికల కమిషన్ ఆదివారం ఆదేశించింది.ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్‌లకు ఫోన్‌ చేశారని జైరాం రమేష్‌ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది.

“మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో సీనియర్ నాయకులు. మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను కలుగజేస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని ఆదేశించింది. కౌంటింగ్‌కు ముందు 150మంది జిల్లా కలెక్టర్లకు హోం మంత్రి ఫోన్‌కాల్స్‌ చేశారనడానికి తగిన ఆధారాలను ఇవ్వాలని పేర్కొంది. తద్వారా తగిన చర్యలు తీసుకుంటాం” అని ఎన్నికల కమిషన్ తన లేఖలో పేర్కొంది.

కాగా, అమిత్ షా ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై నిఘా పెట్టారు. బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా అర్థమవుతోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది” అని ఎక్స్(ట్విట్టర్) లో జైరాం రమేష్‌ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news