నగరంలో భారీ వర్షం…దశాబ్ది ఉత్సావాలకు ఆటంకం

-

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. చిరుజల్లులుగా మొదలైన వాన.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడుతోంది. నగరంలోని గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్,మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్,పంజాగుట్ట, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, బోరబండ,భరత్ నగర్, సనత్ నగర్, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట, బేగంపేట, సీతాఫల్ మండి,రాణీగంజ్, మారేడ్ పల్లి, పద్మారావు నగర్, బోయిన్ పల్లి,సికింద్రాబాద్,ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంద్రాయన్ గుట్ట, కాచిగూడ,కోఠి, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

లక్డీకపూల్, నాంపల్లి,ఖైరతాబాద్, ట్యాంట్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ట్యాంట్ బండ్ పై నిర్వహిస్తున్నటువంటి దశాబ్ది ఉత్సావాలకు ఆటంకం ఎదురైంది. దీంతో దశాబ్ది ఉత్సవాలను త్వరత్వరగా ముగించాల్సి వచ్చింది.రాష్ట్రంలోని పలు జిల్లాలు కరీంనగర్,ఉమ్మడి వరంగల్, మెదక్, మేడ్చల్ జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news