ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమే అధికారం చేపడుతుందని India Today Axis My India తేల్చింది.ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియని యాక్సిస్ మై ఇండియా సంస్థ కూటమి గెలుపుపై జోస్యం చెప్పిందని వైసీపీ విమర్శించింది. ‘రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, చత్తీస్గడ్ ఎన్నికల్లో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు పూర్తిగా తప్పాయి. బుర్రలేని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ఆ సర్వేపై ఆహా అంటూ కీర్తనలు. ఫేక్ సర్వేలను ఆశ్రయించి పరువు పోగొట్టుకున్న కూటమి’ అని ఎద్దేవా చేసింది. ఏపీలో 177 స్థానాలంటూ ఇండియా టుడే ఛానల్లో చూపినట్లు ఓ ఫొటోను వైసీపీ పంచుకుంది.
కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 98-120 సీట్లు వచ్చే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ : 78-96, జనసేన 16-18, బీజేపీ: 4-6, వైసీపీ: 55-77, కాంగ్రెస్: 0-2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది.