జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎన్నికల కమిషన్ ఫోకస్

-

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ పై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సన్నాహక సమావేశం నిన్న ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుధ్ద ప్రకాష్ లతో ఆయన సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మొదటి సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి, 2016 లో జరిగాయి. దాని ఐదేళ్ల పదవీకాలం 10.02.2021 తో ముగిసింది. ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన అన్ని పనులను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలని జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

టి పోల్ సాఫ్ట్వేర్ పైన జోనల్ అధికారులు డిప్యూటీ కమిషనర్ లు ఈ ఆర్ వో లకు అవగాహన కల్పించాలని అని నిర్ణయం తీసుకున్న్నారు. 2016లో 45.29% నమోదు అయిన పోలింగ్ ను ఈసారి పెంచాలని అందుకోసం ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నేపథ్యంలో ఈవీఎం మిషన్స్ వాడాలా లేదంటే బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలా అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఒక్కో పోలింగ్ కేంద్ర0లో 800 కి మించ కుండా ఓట్లు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2వ వారంలో లో మరొకసారి జోనల్ కమిషనర్లు మరియు డిప్యూటీ కమిషనర్ లతో సమావేశం అవుతానాన్న ఆయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version