మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల తరువాత, ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగా ఊహించినట్టుగానే బీజేపీ, శివసేన కూటమి దూసుకెళుతోంది. తాజా సమాచారం ప్రకారం, 37 నియోజకవర్గాల ట్రెండ్స్ పరిశీలిస్తే బీజేపీ 30 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉన్నాయి.
మరోవైపు హరియాణాలోనూ ఇదే తరహా ఫలితం కనిపిస్తోంది. 90 నియోజకవర్గాలున్న హరియాణాలో ఆరు చోట్ల తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ 5 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.