తెలంగాణలో పార్లమెంటు ఫలితాలలో బిఆర్ఎస్ ఘోర ఓటమి దిశగా సాగుతుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపు ప్రక్రియలో టిఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క సీటు లో కూడా ముందంజలో నిలువ లేకపోయింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ బోణీ కొట్టకపోవడంతో ఆపార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్రంలో చక్రం తిప్పుతామనే గులాబీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోగా.. ఇప్పుడు ఎంపీ సీట్లు అయినా గెలిచి పార్టీలో నూతన ఉత్తేజం తీసుకొద్దామనుకున్నా గులాబీ బాస్ కి తీవ్ర నిరాశ ఎదురయింది . గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులకు పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మరి బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయగా, ప్రజలు కేసీఆర్ పెట్టిన సభలకు భారీ సంఖ్యలో వచ్చారు. కానీ నేటి ఫలితాలను చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా మారింది. ఇకపైన పార్టీ పునరుత్తేజం కోసం కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి మరి.