బ్రేకింగ్ : ప్రారంభమైన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. వైసీపీ కొత్త డిమాండ్

-

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రోజు నుంచి… చైర్మన్ ఎన్నిక పై చాలా ఉత్కంఠత నెలకొంది సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ, అలాగే అధికార వైసిపి పార్టీకి సమానంగా 14 వార్డులు రావడంతో… మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి… ఎవరికీ ఓటు వేస్తే వారే… కొండపల్లి మున్సిపాలిటీ పై జెండా ఎగర వేయనున్నారు. ఇక నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కాసేపటి క్రితమే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది.

వాస్తవానికి ఈ చైర్మన్ ఎన్నిక చేతులు ఎత్తడం ద్వారా జరుగుతుంది. అయితే సీక్రెట్ వోటింగ్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ చైర్మన్ అలాగే ఇద్దరు వైస్ చైర్మన్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎక్స్ అఫిషియో ఓటింగ్ విషయంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓటు.. కొండపల్లిలో చెల్లదంటూ వైసీపీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ తమ వాదన వినిపిస్తున్నారు.

ఇక ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కాసేపటికి వెంటనే ప్రత్యేక బస్సులో టిడిపి సభ్యులు… మున్సిపల్ దగ్గరికి చేరుకున్నారు. అనంతరం వట్టి వసంతకుమార్ బృందం చేరుకుంది. ఈ ఓటింగ్ పూర్తికాగానే… పూర్తి వివరాలతో హైకోర్టుకు ఎన్నికల అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు.. ఫలితాలను విడుదల చేయనున్నారు అధికారులు

Read more RELATED
Recommended to you

Exit mobile version