ఏపీ ప్రజలకు బిగ్ షాక్.. త్వరలోనే పెరగనున్న కరెంటు చార్జీలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే విద్యుత్ చార్జీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. విద్యుత్ టారిఫ్ కేటగిరి లో మార్పులు చేయడం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులపై ఏకంగా తొమ్మిది వందల కోట్ల భారాన్ని… ఏపీ విద్యుత్ సంస్థలు మోపాలని ప్రతిపాదించాయి. అవి అమలయితే గరిష్టంగా రెండు వందల లోపు యూనిట్ల విద్యుత్ను వాడుకునే మధ్యతరగతి వినియోగదారులపైనే ఎక్కువ భారం పడుతుంది.

ప్రభుత్వం రాయితీలు పెంచకపోతే వీరు ప్రతి నెలకు ఏకంగా ప్రతి నెలకు ఏకంగా రెండు వందల 80 రూపాయల వరకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ చార్జీలు పెంచ ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావించకుండా హేతుబద్ధీకరణ పేరుతో కేటగిరీలను తగ్గించడం ద్వారా యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయాన్ని వినియోగదారుల నుంచి డిస్కం లు రాబట్టాలని భావిస్తున్నాయి. ఈ మేరకు మార్పులు చేసిన కేటగిరీల ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పరిశీలనకు డిస్కాంలు సమర్పించాయి. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే రాయితీని పెంచకపోతే గృహ వినియోగదారులపై కరెంటు చార్జీల మోత పడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version