సిద్దిపేట జిల్లా వెంక‌ట్రావుపేట‌లో విద్యుత్ లైన్‌మెన్ సాహ‌సం

-

సిద్దిపేట జిల్లా వెంక‌ట్రావుపేట‌లో విద్యుత్ లైన్‌మెన్ సాహ‌సం చేసాడు. అలుగు పారుతున్న చెరువులో విద్యుత్ మ‌ర్మతులు చేసారు లైన్‌మెన్ మల్లేశం. తెప్పపై వెళ్లి చెరువులో స్తంభం ఎక్కి.. పిన్ ఇన్సులెట‌ర్ బిగించారు మ‌ల్లేశం. ఈ సాహసం చేసిన మల్లేశంపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

linemen
Electricity lineman’s adventure in Venkatraopet, Siddipet district

ఇక అటు మెదక్‌లో రైల్వే లైన్ కొట్టుకుపోయింది. కుండపోత వర్షాల వల్ల.. శమ్నాపూర్ రైల్వే బ్రిడ్జ్ కింద భాగంలో భారీగా వరద వచ్చింది. ఈ వరద ఉధృతికి.. రైల్వే ట్రాక్ కింద భాగంలో కంకర రాళ్లు, మట్టి కొట్టుకుపోయాయి. గాల్లో తీగల్లా రైల్వే ట్రాక్ తేలియాడింది.. ఈ విషయాన్ని గుర్తించారు శేఖర్ అనే స్థానికుడు. పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news