ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పాలనపై ప్రభుత్వం పర్యవేక్షణ పెట్టడానికి సిద్ధమవుతోంది. సచివాలయ శాఖ నుంచి ఆరుగురు, డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని ఫంక్షనల్ అసిస్టెంట్లుగా, 17 మంది జాయింట్ డైరెక్టర్/DLDA స్థాయి వారిని సచివాలయ శాఖ అధికారులుగా నియమించనున్నారు. మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారిని… మున్సిపాలిటీలో ఇద్దరు అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తారు.

కాగా, ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి నేటితో ముగుస్తాయి. ఈ సమావేశాలకు జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. కాగా నిన్న జరిగిన సమావేశాలలో భాగంగా జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు జరుపుతున్నారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.