మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ప్రజలపై విద్యుత్ చార్జీల పేరుతో రూ.18 వేల కోట్ల మేర భారం మోపారన్నారు. గత సర్కార్ కారణంగా విద్యుత్ శాఖపై రూ.1.30 లక్షల కోట్ల మేర భారం పడిందని మండిపడ్డారు.ఇప్పుడు వసూలు చేస్తున్నవి సర్దుబాటు చార్జీలు మాత్రమేనని, కరెంట్ చార్జీలు పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు.
విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏపీ జెన్కోను ముంచింది జగనే సర్కారే అని ఆరోపించారు. 2022-23, 2023-24 ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చింది ఆయన కాదా? అని పశ్నించారు.నాడు టీడీపీ అధికారంలో ఉన్న టైంలో మిగులు విద్యుత్ ఉండేదని గుర్తు చేశారు.కరెంట్ చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని.. దమ్ముంటే బహిరంగ చర్చకు వైసీపీ నేతలు రావాలని గొట్టిపాటి రవికుమార్ సవాల్ విసిరారు.