ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే.. సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ ను మళ్ళీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 5 రూపాలకే కడుపునింపే ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నాడు. కానీ తాజాగా కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీ శాల వద్ద ఉన్న వంటశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కిచెన్ లో గ్యాస్ లీక్ అయ్యింది. ఈ గ్యాస్ లీక్ వల్లే భారీ ప్రమాదం జరిగింది. ఇక ఈ పేలుడు థాటికి వంటశాల షెడ్ మొత్తం ధ్వంసం అయ్యింది. 200 అడుగుల మేరా కించే సమన్లు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి. రాత్రి కావడం.. వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఈ భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ కార్మికులు, సిబ్బంది.. ఘటనను ఎవరి కంట పడకుండా కప్పి ఫుచ్చే ప్రయత్నం చేసారు.