నీటి తొట్టిలో ఏనుగు జలకాలు..వీడియో వైరల్

-

చిన్నపిల్లల్లా గున్న ఏనుగులు కూడా సరదాగా నీటిని చూస్తే చాలు ఆ నీటిలో గడపడానికి ఇష్టపడతాయి. జలకాలాటలను ఎంతో ఎంజాయ్ చేస్తాయి. ఓ గున్న ఏనుగు చేసిన ఇలాంటి జలకాలాట దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఏనుగు బాత్ టబ్ లో స్నానం చేసే వీడియోను “సీసీటీవీ ఇడియట్స్” పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు. చిన్నారులు కేరింతలు కొట్టినట్లుగా ఎలిఫెంట్ బాత్ టబ్ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటుంది.

నిజానికి ఈ వీడియో ని స్టోరీ ఫుల్ అనే సంస్థ వాళ్లు తమ వెబ్ సైట్ లో అప్లోడ్ చేశారు. స్టోరీ ఫుల్ అనేది వరల్డ్ సోషల్ మీడియా ఇంటెలిజెన్స్,న్యూస్ ఏజెన్సీ, న్యూస్ అండ్ బిజినెస్ పార్టనర్లకు సరికొత్త సమాచార వేదికగా వ్యవహరిస్తుంది. ఒక బాత్ టబ్ లో ఓ వ్యక్తి పైపుతో నీళ్లు నింపుతుంటే ఈ చిన్న ఏనుగు అందులో పడుకుని అటు ఇటు పొర్ల ఆడడం ఒళ్లంతా శుభ్రంగా అయ్యాక నీళ్లు పట్టించుకోవటం నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఈ వీడియోని గంటల వ్యవధిలోనే లక్ష మందికి పైగా వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news