చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని యాదమరి మండలంలో ఏనుగులు గుంపు బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. యాదమరి మండలం బోధ గుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తంజావూరుకు చెందిన దివ్యాంగుడు వెళ్లిగాన్(45) ఏనుగుల దాడిలో మృతి చెందాడు.
ఆయనకు పుట్టుకతోనే మూగ, చెవుడు, ఈ ఏనుగులు వస్తున్నా సంగతి తెలియక ఆయన అక్కడే ఉండడంతో ఆయనను తొక్కి చంపేశాయి ఏనుగులు. గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వేసవి కావడంతో అడవిలో నీరు చెలమలు ఎండిపోయి ఇలా ఊర్ల మీద పడుతున్నాయని చెబుతున్నారు అటవీ అధికారులు. వారు ఏనుగులను భయపెట్టి అడవిలోకి పంపడానికి చూస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో ?