ట్విట్టర్‌ ఉద్యోగులకు షాక్‌.. వారి జాబితా రెడీ చేయమన్న మస్క్‌

-

ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నారు. వచ్చే శనివారం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ కొత్త బాస్. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా సిద్ధం చేయాలని సంస్థ మేనేజర్లను ఆదేశించారు ఎలాన్ మస్క్. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన వెంటనే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల అధిపతులను తొలగించారు ఎలాన్ మస్క్. ఇక కంపెనీలో పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగులలో దాదాపు 75 శాతం మందిని వదిలించుకోవాలని యోచిస్తున్నట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

నవంబర్‌ 1లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని చూస్తున్నారని వెల్లడించారు. కాగా, ఉద్యోగుల తొలగింపుపై జరిగిన ప్రచారాన్ని ఇప్పటికే తోసిపుచ్చారు ఎలాన్ మస్క్. తానొస్తే 75 శాతం ఉద్యోగాలను తీసేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కరెక్టు కాదని, అలాంటి ఆలోచన లేదని ఆయన ఉద్యోగులతో అన్నట్లు తెలుస్తున్నది. అయితే ట్విట్టర్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ 2023 చివరి నాటికి కంపెనీ పేరోల్‌ (వేతనాల మొత్తం)ను సుమారు 800 మిలియన్ డాలర్లకు తగ్గించాలని అనుకుంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదికలు వెల్లడించాయి. అంటే దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version