స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించిన ఎలన్ మాస్క్

-

ఆదివారం ఇండోనేషియాలోని బాలిలో స్టార్‌లింక్‌ను సేవలను ప్రముఖ బిలియనీర్ SpaceX అధినేత ఎలాన్ మస్క్ ప్రారంభించారు. దీంతో అక్కడి 17 వేలకు పైగా దీవుల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందనుంది. అలాగే దేశ హెల్త్ సెక్టార్తోనూ మస్క్ ఒప్పందం చేసుకున్నారు.

కాగా, ఈ సేవలు వ్యాధినిరోధకత, పిల్లల పోషణ, మధుమేహం వంటి వివిధ డేటా సమాచారాన్ని అందించడానికి, విద్యార్థులకు చదువు, ఉద్యోగాల కోసం ఉపయోగపడనున్నాయి. ఈ సందర్బంగా మస్క్ మాట్లాడుతూ.. స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది, ఆరోగ్య, విద్య రంగాల్లో ఇది గణనీయమైన మార్పులు తెస్తుంది అని అన్నారు.ప్రజలకు రిమోట్ మెడికల్ క్లినిక్‌లాగా సహాయపడుతుంది, ఇది నిజంగా లైఫ్‌సేవర్‌గా మారుతుందని తెలిపారు. కాగా హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యంతో స్టార్ంక్ శాటిలైట్లను రూపొందించారు. ప్రస్తుతం 1,500కు పైగా ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news