ట్విటర్​లో 80 శాతం నకిలీ ఖాతాలే : ఎలాన్ మస్క్​

-

ట్విటర్ పై ప్రపంచ కుబేరుడు, టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పది ట్విటర్​ ఖాతాల్లో ఎనిమిది నకిలీవే అన్న టాప్ మోస్ట్ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాన్ వుడ్స్ వాదనను ఉటంకిస్తూ ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్​పై విరుచుకుపడ్డారు.​ గతంలో ట్విటర్ చెప్పినట్లు నకిలీ ఖాతాల సంఖ్య 5శాతం కాదని కచ్చితంగా అంతకంటే ఎక్కువేనని ఎద్దేవా చేశారు మస్క్​.

యూఎస్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌లతో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎఫ్-5 గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ 80 శాతానికి పైగా ట్విట్టర్ ఖాతాలు నకిలీవి కావచ్చని ది ఆస్ట్రేలియన్‌ పత్రికతో అన్నారు. అలాగే ట్విట్టర్ యజమాన్యం, ఎలాన్ మస్క్ ఇద్దరూ ఈ సమస్యను తక్కువ అంచనా వేసినట్లు చెప్పారు.

ట్విటర్​ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జులైలో రద్దు చేసుకున్నారు మస్క్​. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version