తెలంగాణా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత అత్యాచారం హత్య కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ ఉరి శిక్ష విధించింది. నవంబర్ లో జరిగిన ఈ ఘటనపై తెలంగాణా పోలీసులు 24 గంటల్లో విచారణ పూర్తి చేసి కోర్ట్ లో చార్జ్ షీట్ దాఖలు చేసారు. నేడు తీర్పు వెల్లడించి ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధించింది కోర్ట్. దీనిపై భాదితురాలి తరుపు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.
ఇక అదే సమయంలో జరిగిన దిశా అత్యాచారం హత్యా కేసు నిందితులను కూడా తెలంగాణా పోలీసులు కాల్చి చంపారు. ఈ రెండు ఘటనలు ఒకేసారి జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ రెండు కేసుల్లో కూడా బాధితులకు న్యాయం దాదాపుగా జరిగింది. మరి హాజీపూర్ లో చిన్న పిల్లలను అత్యాచారం చేసి దారుణంగా హత మార్చిన శ్రీనివాస రెడ్డి పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న వినపడుతుంది.
దిశా నిందితులను ఎన్కౌంటర్ చేసారు, సమత దోషులకు ఉరి శిక్ష వేసారు. మరి నలుగురు చిన్న పిల్లలను దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఎందుకు శిక్ష విధించడం లేదని ప్రశ్నిస్తున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. అతను ఘోరాలు చేసాడని, అసలు అతను ఒక మృగం అని సమాజంలో బ్రతకడానికి ఏ మాత్రం అర్హత లేని వ్యక్తి అతను అని అతన్ని ఎందుకు చంపడం లేదని ప్రశ్నిస్తున్నారు బాధితులు.