AUS VS ENG: “బ్యాక్ టు బ్యాక్” సెంచరీస్ తో అల్లాడించిన నటాలీ సీవర్… !

-

ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మహిళల మధ్యన యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా టెస్ట్ ను ఆస్ట్రేలియా గెలుచుకోగా, టీ 20 సిరీస్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది.. ఇప్పుడు వన్ డే సిరీస్ లో సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో చివరిదైన మూడవ వన్ డే లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫిల్డింగ్ ఎంచుకుంది, బదులుగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ నైట్ (67) మరియు నటాలీ సీవర్ లు మూడవ వికెట్ కు 147 పరుగులు జోడించి జట్టును ఒడ్డున పడేశారు. కాగా ఈ మ్యాచ్ లో నటాలీ అద్భుతంగా ఆడి సిరీస్ లో వరుసగా రెండవ సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది. గత మ్యాచ్ లోనూ ఒత్తిడిలో అద్భుతంగా ఆడి సెంచరీ చేయగా, ఇప్పుడు కూడా ఒత్తిడితోనే చక్కగా బ్యాటింగ్ చేసి సెంచరీ మార్కు ను అందుకుంది.

 

కాగా నటాలీ ఆస్ట్రేలియాతో ఆడిన గత అయిదు వన్ డే లలో నాలుగు సెంచరీ లు చేయడం విశేషం. కనీసం ఈ మ్యాచ్ లో అయినా నటాలీ చేసిన సెంచరీ ఇంగ్లాండ్ విజయానికి కారణం అవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news