ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. 17 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలలో భారత్… తొమ్మిది వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. కానీ మొదటి రెండు టి20 మ్యాచ్ లలో విజయం సాధించడం వల్ల సిరీస్ టీమ్ ఇండియా వశం అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్… టి20 లో తొలి శతకం బాదాడు.
ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమితో రోహిత్ అరుదైన రికార్డు కు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే టి20, వన్డే, టెస్టులు కలిసి వరుసగా మొత్తం 20 మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేసేవాడు. కానీ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఓటమిపాలైంది. సూర్య కుమార్ యాదవ్ 117 పరుగులు తప్ప మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో ఈ సిరీస్ 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది.