ఏపీలోని తిరుపతి జిల్లాలో గల శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇష్టారాజ్యాంగ ప్రోటోకాల్ దర్శనాలు జరుగుతున్నాయని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈవో రంగంలోకి దిగారు. ఈ క్రమంలనే ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ చేశారు.
తెల్ల కాగితంపై ప్రోటోకాల్ ఉద్యోగి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి సిఫార్సులు పంపినట్లు విచారణలో ఈవో తేల్చారు. గత 8 నెలలుగా అడ్డగోలుగా ఏఈవో దర్శనాలు చేయించినట్లు ఈవో గుర్తించారు. ఈ క్రమంలోనే అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా ఈవో బాపిరెడ్డి పట్టుకున్నారు. దీనికి కారణమైన విద్యాసాగర్ రెడ్డి, దుర్గాప్రసాద్, విశ్వనాథ్ శర్మలకు మెమోలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.