కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరుణంలో తండ్రి మృతదేహాన్ని చూసేందుకు సైతం తిరిగిరాలేదు కూతురు. ఈ సంఘటన వివరాలులా ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య(46) కూతురు(18) ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన తండ్రికి, కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పోలీసులు తెలిపారు.

తన కూతురితో ఒక్కసారి మాట్లాడాలని అడగగా, కూతురు మాట్లాడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గట్టయ్య తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కూతురికి ఫోన్ చేసి తండ్రి మరణ వార్త తెలపగా, తాను ముంబైలో ఉన్నానని తిరిగి రావడం కుదరదని కూతురు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.