ఈపీఎఫ్ ఈ-నామినేషన్ చేస్తే ఈ లాభాలు పొందొచ్చు..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో వున్నవాళ్లు తప్పకుండ ఈ-నామినేషన్ చేసుకోవాలి. రిటైర్‌మెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యులును తప్పనిసరిగా ఈ-నామినేషన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకు చెయ్యాలి..?, దీని వలన కలిగే లాభం ఏమిటి అనేది చూద్దాం.

ఈ-నామినేషన్ చేసుకోవడం వలన ఈపీఎఫ్ఓ అందిస్తోన్న పలు రకాల ప్రయోజనాలను పొందడానికి అవుతుంది. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. నేరుగా ఈపీఎఫ్ఓ యూఏఎన్ పోర్టల్‌లోనే నామినేషన్ చేసుకోవచ్చు. ఇక దీని వలన ఎలాంటి లాభాలను పొందొచ్చు అనేది చూస్తే.. కాగితరహిత, వేగవంతమైన క్లయిమ్ సెటిల్‌మెంట్ కి ఇది హెల్ప్ అవుతుంది.

అలానే ఖాతాదారు మరణిస్తే వేగంగా ఆన్‌లైన్ క్లయిమ్ సెటిల్‌మెంట్ చేసుకోచ్చు. అర్హులైన నామినీలకు ఆన్‌లైన్‌గా పీఎఫ్ పేమెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్ (రూ.7 లక్షల వరకు) చెల్లింపులు కి కూడా హెల్ప్ అవుతుంది. పీఎఫ్ ని పొందడానికి, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఆన్‌లైన్‌గా పొందేందుకు కూడా తప్పక యాడ్ చేసుకోవాలి. ఇక మరి ఎలా ఈ ప్రక్రియని పూర్తి చేసుకోవాలో కూడా చూసేద్దాం.

దీని కోసం మీరు ముందు epfindia.gov.inలోకి వెళ్లాలి.
మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
నెక్స్ట్ మీరు ఈ నామినేషన్ ని సెలెక్ట్ చెయ్యండి.
ప్రొవైడ్ డీటెయిల్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి సేవ్ చెయ్యండి.
ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కోసం యెస్‌ను క్లిక్ చెయ్యాలి .
ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, జెండర్, రిలేషన్, అడ్రస్ మొదలైన వివరాలను నమోదు చేయాలి.
ఇలా పూర్తి చేసుకోవాలి. అదే ఒకరి కంటే మరింత మంది నామినీలను యాడ్ చేసుకునేందుకు ‘Add Family Details’ను క్లిక్ చెయ్యండి.
‘నామినేషన్ డీటెయిల్స్’పై క్లిక్ చేసి, ‘సేవ్ EPF నామినేషన్’పై క్లిక్ చెయ్యండి.
ఈ-సైన్ కోసం ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version