ఈపీఎఫ్ పెన్షన్లు తీసుకునే పెన్షనర్లకు ముఖ్య గమనిక. ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో సమర్పించవలసిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ పత్ర ఇక మీదట ఏడాది పొడవునా ఏ సమయంలోనైనా సమర్పించవచ్చు. అయితే సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.
డిసెంబర్ 2019లో లేదా ఆ తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన పెన్షనర్లు లేదా పెన్షన్ పొందడం మొదలై ఏడాది కూడా అవ్వని పెన్షనర్ లు ఈ సంవత్సరం నవంబర్లోనే సమర్పించాల్సిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సంపర్పించాల్సిన అవసరం లేదు. అంతే కాక పెన్షనర్లు ఈపీఎఫ్ఓ ఆఫీస్ కు వెళ్ళకుండానే వాళ్ళు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న బ్యాంక్ లేదా, కేంద్ర ప్రభుత్వ UMANG యాప్ ద్వారా కానీ కామన్ సర్వీస్ సెంటర్ లలో కానీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ పత్ర సమర్పించవచ్చని సమాచారం.