పాలకుర్తి పర్యటనలో కల్లు రుచి చూసిని మంత్రి ఎర్రబెల్లి

-

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పర్యటనలో బురాన్‌పల్లి వద్ద ఓ గీత కార్మికుడు కల్లు తీస్తుండగా గమనించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెంటనే కాన్వాయ్‌ని ఆపారు. ఆ తర్వాత గీత కార్మికుడితో మంత్రి ముచ్చటించారు. పిల్లలు ఏం చేస్తున్నారు ? సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు అమలు అవుతున్నాయా..? అంటూ ఆరా తీశారు. కల్లు బాగా పారుతోందా? లాభసాటిగా ఉంటుందా ? పెన్షన్లు, బీమా అందుతున్నాయా? అంటూ అడిగి తెలుసుకున్నారు.

ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లిని కల్లు రుచి చూడాలని గీత కార్మికుడు కోరగా.. రుచి చూసి, క‌ల్లు బాగుందని తెలిపారు. ఎస్ఐ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన మహేశ్‌ను మంత్రి దయాకర్‌రావు అభినందించారు. శాలువాతో సత్కరించారు. పాలకుర్తిలో క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో మంత్రిని మహేశ్ కలువగా.. అభినందించి గ్రామం పేరు నిలబెట్టేలా పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే అనేక పథకాలకు మహిళలని లబ్ధిదారులుగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు.శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిన పంపిణీ చేయడంతో పాటు కొడకండ్ల లోను మినీ టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నామని దీనితో స్థానికులకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా,బొంబాయి, భీమండి, సూరత్ వంటి నగరాలకు వలస పోయిన వారికి ఇక్కడ పునరావాసం లభిస్తుందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version