అంబేద్కర్‌ ఎందరికో ఆదర్శం : మంత్రి ఎర్రబెల్లి

-

వరంగల్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కేశవ పురంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. అంబేద్కర్‌ దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని ఎర్రబెల్లి దయాకర్‌ పేర్కొన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు నిర్మించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు.ద‌ళితుల‌కు రిజ‌ర్వేషన్లు క‌ల్పించింది అంబేద్కరేనని అన్నారు.స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన సాగుతుందని అన్నారు.వారి స్ఫూర్తిని పొందడం కోసమే 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించుకున్నామని, కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని వివరించారు.దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి దయాకర్‌ పేర్కొన్నారు.

దళితుల్లో ఆర్థిక సాధికారత లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు.రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు కేటాయింపునకు సీఎం సిద్ధంగా ఉన్నారని ,ఈ పథకం పర్యవేక్షణకు సీఎం కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version