బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్ర పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పోలీసులు టిఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన గూండాలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై పోలీసులు తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.
జనగామ జిల్లా దేవర్పుల మండలంలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తత అనంతరం బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తమపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు అని మండిపడ్డారు. తమ కార్యకర్తలకు ఇద్దరికీ తలలు పగిలాయని అన్నారు. బిజెపి కార్యకర్తలపై దాడి విషయంలో పోలీసులు స్పందించకపోతే గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో డిజిపి ఆఫీసుకు తీసుకువస్తామని, ముఖ్యమంత్రిని రమ్మనండి అంటూ డిజిపితో అన్నారు బండి సంజయ్.