వరంగల్ తూర్పులో రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కు సవాల్ విసిరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకోవాలని.. నేను ఇండిపెండెంట్ గా నిలబడి నిన్ను ఓడ కొడతానంటూ ఛాలెంజ్ చేశారు ఎర్రబెల్లి. ఒకవేళ తాను ఓడిపోతే నీ కింద గులాం గిరి చేస్తానని స్పష్టం చేశారు.
ఒకవైపు మంతనాలు జరుపు తూనే… మరోవైపు బయటకు పంపేందుకు పోగపెడుతుందని టీఆర్‌ఎస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారంలేని ఎమ్మెల్యే నరేందర్ మాటలే ఇందుకు నిదర్శనమని అన్నారు టీఆర్ఎస్ నేత ప్రదీప్ రావు. మా ప్రమేయం లేకుండానే గెలిచానని భావిస్తున్నా ఎమ్మెల్యే నరేందర్ దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గొప్పగా అభివృద్ధి చేశానని చెప్తున్నావూగా ఎన్నికలలో పోటీ చేసి నీ అభివృద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వరంగల్ శాసనసభ్యుడు అంటే ఇష్టం వ చ్చి మాట్లాడు కాదని ఆగ్రహించారు.