అస్సాంలో నిమజ్జనం ఉండగా..హైదరాబాద్‌ ఎందుకు వచ్చావు – ఎర్రబెల్లి ఫైర్

-

అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిష్వ శర్మ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫైర్ అయ్యారు. హనుమకొండ లోని పద్మాక్షి గుట్ట సిద్దేశ్వర గుండం చెరువులో, బంధం చెరువులలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో స్థానిక నేతలు అధికారులతో పాల్గొన్నారు ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ… ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న హైదరాబాద్ లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే అస్సాం ముఖ్యమంత్రి వచ్చారని ఓ రేంజ్‌ లో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరుగుతున్నట్లే అస్సాంలో కూడా జరుగుతుందని తెలిపారు.

అక్కడ నిమజ్జనం వేడుకలలో పాల్గొనకుండా హైదరాబాద్ రావడం వెనుక ఆంతర్యం ఏంటి..? అని నిలదీశారు. కేసీఆర్ సారథ్యంలో ఎనిమిది ఏళ్ల నుండి ఎలాంటి అల్లర్లు లేకుండా హైదరాబాద్ లో నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి రాక వల్ల హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది..మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నేతలు మతఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version