కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను చేయకుండా.. అనవసరమైన పనులు చేస్తున్నాయని లోక్ సత్త పార్టీ వ్యవస్థపకులు జయప్రకాశ్ నాయరణ ఆరోపించారు. దేశంలో ఎక్కడా కూడా సరి అయిన వైద్య విధానం లేదని అన్నారు. దీని వల్ల సామాన్యమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేడు హైదరాబాద్ లో అందరికీ ఆరోగ్యం.. హక్కుగా వైద్య సేవలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
70 ఏళ్ల నుంచి దేశాన్ని పాలించిన పార్టీలు కూడా సరి అయిన వైద్య విధానలను అమలు చేయలేదని అన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా వైద్య విధానలను పట్టించుకోవడం లేదని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన సమయాలల్లో అయినా.. సరి అయిన వైద్య విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలకు ఎన్నికలు గురించి తప్ప ఇతర వాటి గురించి అవసరం లేదని విమర్శించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచే ఆరోగ్య శ్రీ వంటి పథకాలు రావడం గొప్ప విషయం అన్నారు. కానీ ఆరోగ్య శ్రీ పథకం అన్ని వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని అన్నారు.