హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్ మెక్ కార్యాలయం ఏర్పాటు కానుంది. 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ….గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ డ్రిల్ మెక్ , తెలంగాణ ప్రభుత్వం మధ్య నేడు అవగాహన ఒప్పందం (MoU) జరుగనుంది. డ్రిల్‌మెక్ ఏర్పాటుతో కొత్తగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థగా డ్రిల్‌మెక్ వ్యవహరిస్తోంది.
తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను తయారు చేయనుంది అంతర్జాతీయ సంస్థ డ్రిల్ మెక్. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా డ్రిల్‌మెక్ పేరు పొందింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో తెలంగాణలో భారీ ఉపాధి అవకాశాలు కలుగ నున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 200 మిలియన్ US డాలర్ల టర్నో వ ర్ ఉన్న డ్రిల్‌మెక్.. తన ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ విస్తరిస్తోంది.