రాష్ట్రంలో 4,00,283 మందికి కోవిడ్ లక్షణాలు… ఫీవర్ సర్వేలో షాకింగ్ నిజాలు

-

రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదన్న రీతిలో కోవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు జనాలు. ఫీవర్ సర్వే ప్రారంభం అయిన 9 రోజుల్లోనే 4,00,283 మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం ప్రతీ ఇంటిలో కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు ఉన్నారు. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన రావడంతో చాలా మంది ప్రజలు టెస్టులకు దూరంగా ఉన్నారు. దీంతో ఇంట్లో ఉంటూనే.. మెడిసిన్స్ వాడుతున్నారు. అయితే కోవిడ్ నిర్థారణ కాకపోయినా… 3,97,898 మందికి మందులు కిట్లు అందచేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. లక్షణాలు ఉన్నవారు క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ మరో విడత ఫీవర్ సర్వే చేయాలని భావించింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ టీములు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. దీంట్లో భాగంగానే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version