ఈటల రాజేందర్ హుజురాబాద్ పర్యటన.. గంగుల కమలాకర్ కౌంటర్లు.

-

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకీ, మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనకు ఈటల రాజేందర్ రానున్నారు. బీజేపీలో చేరిన తర్వాత వస్తున్న మొదటి పర్యటన కావడంతో హుజురాబాద్ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. జమ్మికుంటలోని పలు గ్రామాల ప్రజలతో ముచ్చటించేందుకు ఈటల సిద్ధమయ్యారు.

ఐతే తెరాసకి చెందిన గంగుల కమలాకర్ ఈటల హుజురాబార్ పర్యటనపై కౌంటర్లు వేసారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఈటల అస్సలు పట్టించుకోలేదని, ఆస్తులు కూడబెట్టుకునేందుకే చూసారని, వారం రోజుల్లో హుజురాబాద్ ని అభివృద్ధి చేస్తామని సవాల్ చేసారు. మొత్తానికి ఈటల ఎపిసోడ్, హుజురాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు చర్చనీయాంశంగా ఉండనుంది. చూడాలి మరి, ఈ ప్రాంత ప్రజలు ఎవరికి అధికారాన్ని ఇస్తారో!

Read more RELATED
Recommended to you

Exit mobile version