హుజురాబాద్ గడ్డ మీద కేసీఆర్ కు డిపాజిట్ రాదని.. వస్తే తాను బాధ్యత వహిస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. జమ్మికుంట లో బిజెపి రైతు కిషన్ మోర్ఛ రెడ్డి సభ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చక్రవర్తులు, రాజుల చరిత్ర గురించి మన అందరికి తెలుసని… కానీ ఈ రాజు చరిత్ర చాలా నీచమైనదని ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయంలో తాను సంపాదించి ఇచ్చిన డబ్బు కాదా.. ? ఒకప్పుడు నా ఆస్తీ ఎంత, కేసీఆర్ ఆస్తీ ఎంత లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్ముకున్నది ఎవరో చెప్పాలని… సిఎం కేసీఆర్ నియంత పాలన అంతం చేసేందుకు మన అందరం ముందు అడుగు వేయాలని పిలుపునిచ్చారు.
ఈటల రాజేందర్ గుర్తు కారు గుర్తు అని చెప్పుకుంటున్నారని… నీ ముఖం చెళ్లక తన పేరు చెప్పుకుంటున్నావని మండిపడ్డారు ఈటెల రాజేందర్. 2023 ఎన్నికలకు జస్ట్ ఈ ఎన్నిక రియాల్సాల్ లాంటిందని.. 2023 లో తెలంగాణ లో ఎగిరేది కాషాయ జెండానని ధీమా వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్.