ఈటల రాజేందర్ తనను ఒంటిరి చేసేందుకు టీఆర్ ఎస్ వేస్తున్న ఎత్తుగడలపై తీవ్రంగా స్పందించారు. హుజూరాబాద్‌లో తన అనుచరులు, కార్యకర్తలను ప్రలోభ పెడుతున్నారని, కార్లు, గిఫ్ట్‌లు ఇస్తూ తమవైపు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. నిన్న ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన టీఆర్ ఎస్‌పై విరుచుకు పడ్డారు.
అయితే మరీ ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ హెచ్చరించారు. మొదటి నుంచి వీరిద్దరికీ పెద్దగా సఖ్యత ఉండేది కాదు. ఇద్దరూ ఒకే ఉమ్మడి జిల్లాకు చెందిన వారైనా వీరి మధ్య కాస్త విబేధాలు ఉండేవి.
ఇప్పుడు గంగుల కమలాకర్ మాత్రమే టీఆర్ ఎస్ తరఫున ఈటలపై ఆరోపణలుచేస్తున్నారు. ఈటల కేడర్‌ను పిలిచి పార్టీతో ఉండాలని చెప్తున్నారు. పదువులు, గిఫ్ట్‌లు ఇస్తామంటూ చెబుతున్నారు. దీనిపై ఈటల స్పందిస్తూ ఉద్యమంతో సంబంధంలేని మంత్రి తన మనుషులను బెదిరిస్తున్నారని, ఇది మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరి ఈ మాటలపై గంగుల ఎలా స్పందిస్తారో చూడాలి.