మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అబద్దాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే అని మండిపడ్డారు. కేసీఆర్ వల్లనే ఒక మహిళా ఎమ్మార్వో మీద పెట్రోలు పోసి తగలబెట్టారలని, డిపార్ట్మెంట్ ను అంపశయ్య మీద పడుకోబెట్టి అయన మార్క్ రాజకీయం మొదలు పెట్టిండు అంటూ ఈటల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అసైన్మెంట్ భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. భూమి తప్పు పడింది అంటే కోర్టుకు పొమ్మంటున్నారు. పేద రైతు లక్షల ఖర్చుపెట్టి కోర్టు మెట్లు ఎక్కగలరా ? ధరణి మనకోసం తేలే, మన కళ్ళల్లో మట్టి కొట్టడానికి తెచ్చారు.
హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు ఉంటుంది.. 2000 ఎకరాలు మాయం చేసి 1 లక్ష కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేశారు. ఇవన్నీ వీఆర్వో, వీఆర్యే, ఎమ్మార్వో లకు తెలుస్తుంది అని వారిని తప్పించి.. ప్రగతి భవన్ చేతిలో స్విచ్ పెట్టుకొని వారి బినామీల పేరిట భూములు ఎక్కించుకున్నాడు. వీఆర్యే లు శాసన సభలో ఇచ్చిన హామీ అమలు చేయమంటున్నారు. 60 రోజులుగా సమ్మె చేస్తున్నా 50 మంది చనిపోయినా నీరో చక్రవర్తిని వ్యవహరిస్తున్నారు. గ్రామ కార్యదర్శుల మీద పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భూతల్లి మీద కన్నివేసి మన కళ్ళల్లో మట్టి కొట్టినవాడు ఈ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ధ్వజమెత్తారు.