సంతానం కలగకపోతే ఆస్పత్రులకు వెళ్తారు.. లేదంటే వైద్య నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తారు. కానీ అక్కడ మాత్రం సంతానం కోసం విదేశీ యువతులు ‘లడఖ్’కు పరుగులు తీస్తున్నారు. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మాల్సిందే. కేవలం గర్భం దాల్చడం కోసమే యూరోపియన్ దేశాలకు చెందిన పెళైన యువతులంతా లడఖ్‌కు క్యూ కడతారు. ఎందుకంటే.. లడఖ్‌లో అత్య«ధికంగా ఆర్యన్ సంతతికి చెందిన వారు నివాసిస్తుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఆర్యన్లు అంటేనే నీలి కళ్లతో అందంగా ఉండి ఆరగడుగుల ఆజానుబాహులుగా ఉంటే అబ్బాయిల కోసం స్పెయిన్, ప్రాన్స్, జర్మనీ దేశాల నుంచి యువతులు ప్రతి సంవత్సరం లడఖ్‌కు వచ్చి ఇక్కడి వారితో శృంగారంలో పాల్గొని ఆర్యన్ సంతానం పొందుతారంటా.
ప్రెగ్నెన్సీ టూరిజంగా..
కేవలం సంతానం కోసమే వివిధ దేశాలకు చెందిన యువతులు లడాఖ్‌కు వస్తుండటంతో అక్కడున్న ఆర్యన్ వ్యాలీకి (ప్రెగ్నెన్సీ టూరిజం) అని ప్రత్యేకంగా పేరు కూడా పెట్టారు.క్రీ .పూ. గ్రీకువీరుడు అలెగ్జాండర్ వరుసగా రాజ్యాలను జయిస్తు భారదేశానికి వచ్చాడు. అప్పుడు సింధూ లోయా వరకు వచ్చిన అలెగ్జాండర్ అటునుంచి అటుగానే వెళ్లిపోయాడు. వెనుదిరిగే క్రమంలో అతని వెంట ఉన్న వేల సైన్యంలో కొందరు అక్కడే(సింధులోయా) ఉండిపోయారు. రానురాను వారు అక్కడే స్థిరపడిపోయారు. అప్పటి నుంచి వారందరినీ ఆర్యన్‌లలో చివరి వారిగా పిలుస్తారు. లడఖ్‌లోని ఐదు గ్రామాల్లో చివరి ఆర్యన్లగా పిలువబడే వారు జీవనం గడుపుతున్నారు.