ఖర్గేకు సీఎం యోగి కౌంటర్..మీ తల్లినీ, చెల్లినీ చంపిన వారిపై ఆగ్రహించండి!

-

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సన్యాసులు రాజకీయాల్లోంచి తప్పుకోవాలని ఖర్గే చేసిన వ్యాఖ్యలకు యోగి స్పందిస్తూ.. ‘బాటేంగేతో కాటేంగే’ అంటే మీకు కోపం వస్తోంది కదా? దాన్ని నాపై కాదు హైదరాబాద్ నిజాంపై చూపించండి. రజకార్లు మీ ఊరిని తగలబెట్టారు. హిందువుల్ని దారుణంగా చంపారు.

మీ తల్లిని, చెల్లిని,మీ కుటుంబీకుల్ని దారుణంగా చంపేశారు. (కులాలుగా)విడిపోతే జరిగే నష్టమిదే. ఓటు బ్యాంకు కోసం దాన్ని మీరు మర్చిపోయినట్టు ఉన్నారు’ అంటూ యోగి కౌంటర్ ఇచ్చారు. భారతీయులంతా కులాల వారీగా, మతాల వారీగా విడిపోతే దేశం ముక్కలు అవుతుందని తప్పా జాతి అభివృద్ధి సాధ్యం కాదని పలువురు సీనియర్ పొలిటికల్ నేతలు సైతం హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version