ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం భారీ ప్లాన్ కు సిద్ధం అయింది.రానున్న భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ రంగంలో సదుపాయాలను పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ రెండు కంపెనీలు కలిసి మొత్తం దేశవ్యాప్తంగా 17000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి. ఇటీివల కాప్ 26 సమావేశంలో ఇండియాలో రానున్న సంవత్సరాల్లో కర్భన ఉద్గారాలను తగ్గిస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా రానున్న కాలంలో ఇండియాలో ఎలక్ట్రిక్ ఉద్యమం రానుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. దీన్ని ముందుగానే క్యాస్ చేసుకునేందుకు ఐఓసీఎల్ 10 వేలు, భారత్ పెట్రోలియం 7 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి.
అయితే ప్రస్తుతం ఈవీ మార్కెట్లో టూవీలర్లు 1 శాతం మాత్రమే ఉన్నాయి. ఫోర్ వీలర్లు 0.2 శాతం మాత్రమే ఉన్నాయి. ఇది 2030 సంవత్సరానికి గానూ ఫోర్ వీలర్లలో 15 శాతం వాహనాలు ఈవీలు ఉంటాయని అంచానా వేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, సూరత్ మరియు పూణే వంటి నగరాల్లో ఛార్జింగ్ ఇన్ ప్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత హైవేలపై ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.