చంద్రబాబు ఢిల్లీ స్థాయి నాయకుడు అనుకున్నా.. గల్లీకి కూడా పనికిరాడు : బ్రహ్మనాయుడు

-

టీడీపీ అధినేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడు. తాజాగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీ స్థాయి నాయకుడు అనుకున్నా.. గల్లీకి కూడా పనికిరాడు అని తేలిపోయిందని బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. నువ్వు మగాడివి అయితే నేను తప్పు చేశానని నిరూపించు అంటూ సవాల్ విసిరారు.

నేను దోచుకున్న 175 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు బ్రహ్మ నాయుడు. దమ్ముంటే నేను తప్పు చేశానని నిరూపించు. ఈ ఆస్తి తీసుకున్నావు అని చెప్పే వారెవ్వరో ఇక్కడికి రావాలన్నారు. చంద్రబాబు నువ్వు రా మగాడివి అయితే.. చూపించు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు బ్రహ్మ నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడంగానే సరి కాదు.. మేము మాట్లాడతాం. నువ్వు జైలుకు పంపించేది ఏంది మమ్మల్ని..? ఒక్క సెకండ్ పట్టదు.. కానీ  నీ పెద్దరికానికి నీకు గౌరవం అనేది లేదు. నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు అన్నారు బ్రహ్మనాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version