లోక్ సభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాని రేసులో ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అవకాశం వస్తే తాను కూడా 100% ప్రధాని పదవి రేసులో ఉంటానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నేను అంత అమాయకుడినా? అవకాశం వస్తే ఎవరైనా ఉండరా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్ అన్నారు.’అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘రాధాకిషన్ రావు ఎవరు? రాష్ట్రంలో 100 మంది DCPలు ఉంటారు. వాళ్లలో ఒక్కరి గురించి నన్ను అడిగేది ఏంటి? అసలు సీఎంకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉంటుందా? అని ప్రశ్నించారు.
మాకు నివేదికలు ఇస్తారు. వాళ్లు ఎలా నివేదికలు ఇస్తారో సీఎంకు అవసరం లేదని.. గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వాలు ఉండవని కేసిఆర్ అన్నారు. రోజూ సీఎంకు మార్నింగ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుందని పలువురు మీడియా ప్రతినిధులపై ఫైరయ్యారు.