రోజులో ఒక్కసారి ఫాస్ట్‌ ఫుడ్‌ తిన్నా ఈ డిసీజ్‌ వస్తుందంట..

-

మనసుకు నచ్చినవి తినడం, చేయడం వల్ల మనం సంతోషంగా ఉంటాం..అలానే చేయాలి..కానీ అన్ని విషయాల్లో కాదు..కొన్నిసార్లు మనసు మాట కన్నా..మంచిమాట వినడం బెటర్‌..బయటకు వచ్చినప్పుడు రోడ్డుపక్కన ఉండే పానీపూరి చూడగానే నోరూరుతుంది..తినేస్తాం..ఒక్కసారి రెండుసార్లు అంటే పర్లేదు..కానీ డైలీ తింటే, పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలానే ఉంది..సరే ఇన్ని తింటున్నారు కదా..డైలీ ఒక గంట వ్యాయామం చేస్తారా..? లేదు. ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో లివర్ వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తేల్చింది.
కెక్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయన ఫలితం క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఫాస్ట్ ఫుడ్ వినియోగం తగ్గించకపోతే రిస్క్‌ తప్పదని స్డడీలో తేలింది.. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కారణంగా ఏర్పడే ఈ వ్యాధి ప్రాణాంతకమైందని స్టడీ స్పష్టం చేసింది. లివర్‌ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయువు.. కొన్ని వందల పనులును లివర్‌ నిర్వర్తిస్తుంది..ఎప్పుడైతే ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చిందే.. ఆ పనులన్నీ ఆగిపోతాయి..మత్తెక్కిన వాళ్లు ఎలా అయితే బద్ధకంగా ఉంటారో..అలానే లివర్‌ కూడా బద్ధకంగా ఉంటుంది..దానివల్ల వ్యర్థాలు పేరుకుపోతాయి.
ఒబెసిటీ, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడే వారు రోజువారీగా అవసరమైన క్యాలరీల కంటే ఫాస్ట్ ఫుడ్ ద్వారా 20 శాతం అధికంగా తీసుకోవడం వల్ల లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు స్టడీలో గుర్తించారు.. ఫాస్ట్ ఫుడ్ తీసుకోని వారిలో ఇలాంటి పరిస్థితి లేదని తేల్చింది. ఇక జీవనశైలి వ్యాధులు లేనివారు తమ రోజువారీ డైట్‌లో 20 శాతం ఫాస్ట్ ఫుడ్ రూపంలో తీసుకునే వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమైందని వివరించింది.
ఆరోగ్యకరమైన కాలేయం కొంత మొత్తంలో కొవ్వును కలిగి ఉంటుంది. ఇది ఏమాత్రం పెరిగినా అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు దారితీస్తుందని కెక్ మెడిసిన్ హెపటాలజిస్ట్ అని కర్దాషియన్ వివరించారు. ఒబెసిటీ, డయాబెటిస్ ఉన్న వారిలో కాలేయంలో కొవ్వు పెరిగిపోవడానికి ఫాస్ట్ ఫుడ్ కారణమవుతుందని ఆయన వివరించారు..
ఒబెసిటీ, డయాబెటిస్‌లకు ఫాస్ట్ ఫుడ్‌తో ఉన్న సంబంధాన్ని గత అధ్యయనాలు తేల్చగా, ఇప్పుడు వారి లివర్ హెల్త్‌పై కూడా ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తేల్చింది. అధికంగా కార్బొహైడ్రేట్లు, కొవ్వులు ఉండే ఫాస్ట్ ఫుడ్ మితంగా తీసుకున్నా సరే లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఈ స్టడీ తేల్చింది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో రోజుకు ఒక పూట తిన్నా వారి ఆరోగ్యం పీకినట్లే..

క్యాన్సర్‌ కూడా రావొచ్చు..

లివర్ స్టెటొసిస్‌గా పిలిచే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లివర్ సిరోసిస్‌కు దారి తీస్తుంది. కాలేయాన్ని గాయపరుస్తుంది. అంతిమంగా లివర్ క్యాన్సర్‌కు, లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. అమెరికా జనాభాలో దాదాపు 20 శాతం జనాభాపై ఈ లివర్ స్టెటొటిస్ ప్రభావం చూపిస్తోంది. అమెరికా వార్షిక న్యూట్రిషనల్ సర్వే ఫలితాల ఆధారంగా లివర్ స్టిటోటిస్‌పై ఫాస్ట్ ఫుడ్ వినియోగ ప్రభావాన్ని ఈ అధ్యయనంలో నిర్ధారించారు.
పిజ్జాతో సహా విభిన్న రకాల ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని విశ్లేషించారు. దాదాపు 4 వేల మంది వయోజనులపై ఈ అధ్యయనం జరిపారు. వీరిలో 52 శాతం ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నట్టు గుర్తించారు.. 29 శాతం మంది తమ రోజువారీ క్యాలరీల వినియోగంలో ఐదో వంతు ఫాస్ట్ ఫుడ్ ద్వారా సమకూర్చుకున్నట్టు తెలిపారు. ఈ 29 శాతం మందిలో ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అధ్యయనంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version