తప్పు చేసినా.. చెయ్యకపోయినా.. నీదే బాధ్యత.. సమంత పోస్ట్ వైరల్..!

-

సమంత .. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. సమంత తన వ్యక్తిగత విషయాల ద్వారా వైరల్ అవుతూనే.. మరొక పక్క సినిమాల ద్వారా కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంటూ వస్తుంది. వివాహానికి ముందు వరకు చాలా ముద్దుగా, చలాకీ గా, అల్లరి పిల్లగా కనిపించిన సమంత వివాహం తర్వాత చాలా బోల్డ్ గా కనిపిస్తూ అందరిలో హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తోంది. ఇకపోతే నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండి, ఎంతో మందికి ఆదర్శ దంపతులుగా నిలిచిన వీరు ఉన్నట్టుండి విడాకులు తీసుకొని అందుకుగల కారణాలను కూడా ఎవరికీ తెలియజేయలేదు. అటు సమంత , ఇటు నాగచైతన్య ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తమ పనులు తాము చేసుకుంటూ బిజీ అయిపోయారు.

ఇకపోతే నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాలను అందుకొని.. బాలీవుడ్ రంగం వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సమంత కూడా బాలీవుడ్ వైపు తన సత్తా చాటడానికి సిద్ధమయ్యింది.. ఇక ఇందులో భాగంగానే అక్షయ్ కుమార్ తో నటించే అవకాశం చేసుకున్న సమంత అక్కడ బాగా పాపులారిటీ షో అయినటువంటి కాఫీ విత్ కరణ్ షో ద్వారా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేసింది. ఇక నిజానికి నాగచైతన్య ఏ రోజు కూడా సమంత గురించి తప్పుగా మాట్లాడింది లేదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా మేము సంతోషంగా ఉన్నాము అంటూ ఆయన ఒక్క మాటలో ముగించారు. కానీ సమంత మాత్రం అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రకరకాల మాటలు మాట్లాడుతుండడంపై సమంతపై ఒక వర్గం వారు ఫైర్ అవుతున్నారు.

ఇక సమంత నిన్న మాట్లాడిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక షో ముగిసిన తరువాత ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా “తప్పు చేసినా.. చేయకపోయినా బాధ్యత నీదే “అంటూ సద్గురు ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఇక సమంత నిన్న జరిగిన రాద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పోస్ట్ చేసింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version