90 శాతం ప‌థ‌కాలు ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ప్ర‌క‌టించ‌న‌వే : కేసీఆర్‌

-

బీఆర్ఎస్ పార్టీ క్యారెక్ట‌ర్ ఏంటంటే.. మేనిఫెస్టోల రూపంలో, ఎన్నిక‌ల ప్ర‌ణాళిక రూపంలో చెప్పింది 10 శాతం మాత్ర‌మే అని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఆచ‌ర‌ణ రూపంలో, స్వీయ అనుభావాల‌ను, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను బ‌ట్టి.. 90 శాతం ప‌థ‌కాల‌ను రూప‌క‌ల్ప‌న చేసుకున్నాం. క‌ల్యాణ‌ల‌క్ష్మి, రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, రైతుబంధు, రైతు బీమా వంటి ప‌థ‌కాలు, విదేశీ విద్యా స్కాల‌ర్‌షిప్స్ వంటి వాటిని కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుని అమ‌లు చేశాం. ఇలా 90 శాతం ప‌థ‌కాలు ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ప్ర‌క‌టించ‌న‌వే ఎక్కువ‌గా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.

అంతే కాదు, రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు.ఈ సందర్భంగా రైతులకు ఆయన శుభవార్త తెలిపారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ప్రస్తుతం అందిస్తున్న రైతు బంధు స్కీమ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆర్ధిక సహయం కింద ప్రస్తుతం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్న రైతు బంధు స్కీమ్‌ను అధికారంలోకి వచ్చిన ఏడాది 12 వేల వరకు పెంచుతామని ప్రకటించారు. క్రమంగా దీనిని రూ.16 వేల వరకు అందిస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version