కేసీఆర్ పరాన్నజీవిలా మారిపోయారు: రేవంత్

-

కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రకటించగానే కెసిఆర్ కు చలి, జ్వరం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఆయన సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోయి, పరాన్నజీవిగా మారిపోయారు. ఒకప్పుడు కెసిఆర్ ను ఇతర పార్టీలు అనుసరిస్తాయని బిఆర్ఎస్ నేతలు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ను ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అసాధ్యం అని చెప్పిన కెసిఆర్ .. ఇప్పుడు మేనిఫెస్టోలో వాటినే పెట్టారు’ అని చెప్పారు. కేసీఆర్ పరాన్నజీవిలా మారిపోయారు అన్నారు రేవంత్.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రెండు ఛాలెంజ్ లు విసిరారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి బీఆర్ఎస్ చుక్కా మద్యం పంచదని, డబ్బులు వెదజల్లదని ప్రమాణం చేయగలదా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తే అక్టోబర్ 17న తాను అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని, కేసీఆర్ కూడా వచ్చి అమరుల సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1నే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు వేయగలరా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇండియా కూటమి లో చేరుతామంటే గేటు కూడా తాకనివ్వలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కొల్లగొడుతున్న సొమ్ముతో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. కేసీఆర్ కు వయస్సు అయిపోయిందని తన సూచనగా ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు రేవంత్ అభినందనలు తెలిపారు. తమ అభ్యర్థులను ప్రకటించే వరకు కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వలేదని అన్నారు. తమ గ్యారంటీ స్కీంలను చేసి కేసీఆర్ కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రస్తుతం పరాన్నజీవిలా మారారని.. కాంగ్రెస్ హామీలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నట్లు రేవంత్ గుర్తు చేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్ లో చూపించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని.. పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version