బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే కి గట్టి షాక్ తగిలింది. ముందు నుండి ఆయన ఆశించిన సీటు విషయంలో ఆయనకు షాక్ తగిలింది. బీహార్ అధికార జేడీయూ పార్టీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. అయితే, గుప్తేశ్వర్ ఆశించిన నియోజకవర్గంలో ఓ కానిస్టేబుల్‌కు బీజేపీ టికెట్ ఖరారైంది. బీహార్‌లో బీజేపీ -జేడీయూ మధ్య ఎన్నికల పొత్తు ఉందన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బక్సర్ నియోజకవర్గం బీజేపీకి దక్కింది.
దీంతో మాజీ కానిస్టేబుల్ పరశురాం చతుర్వేదికి బక్సర్ టికెట్‌ను కేటాయించింది బీజేపీ. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తమను టార్గెట్ చేసిందన్న క్రమంలో బీహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్దం అయింది. ఇప్పటికే ప్రచారానికి వెళ్ళాల్సిన వారి పేర్లు కూడా ఖరారు కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారానికి సిద్దమయింది. ఎన్నికల కోసం 40 మందితో ముఖ్య ప్రచారకర్తల జాబితానూ కూడా రూపొందించింది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవారే కూడా ప్రచారంలో పాల్గోనున్నారు.