కాసేపటి క్రితమే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మరియు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈయన జగనన్న కాలనీలలో గృహప్రవేశాల అంశంపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఇంకా నిర్మాణాలు కూడా పూర్తి కాని ఇళ్లను ప్రారంభిస్తున్నారు అంటూ యనమల సెటైరికల్ కామెంట్స్ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లను నిర్మిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందంటూ మాట్లాడారు యనమల. పైగా దీనికి ఆ ఇళ్లను కట్టించింది మేమే అంతో జగన్ అండ్ కో గొప్పలు చెప్పుకుంటున్నారు ఇది రాష్ట్రంలో దాపురించిన దౌర్భాగ్య పరిస్థితి అంటూ రెచ్చిపోయి మాట్లాడారు యనమల.
జగన్ అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతో ఎస్సి, ఎస్టీ మరియు బీసీ లను దారుణంగా మోసం చేశారంటూ ఆరోపించారు యనమల రామకృష్ణుడు. మరి యనమల చేసిన ఈ కామెంట్స్ పై వైసీపీ నుండి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.